HomeMovie Newsవిజయ్ 'ది గోట్' కి బ్లాక్ బస్టర్ టాక్

విజయ్ ‘ది గోట్’ కి బ్లాక్ బస్టర్ టాక్

- Advertisement -

కోలీవుడ్ స్టార్ నటుడు ఇలయదళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఈ మూవీ పై మొదటి నుండి విజయ్ ఫ్యాన్స్ అలానే నార్మల్ ఆడియన్సు అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై అర్చన కలపతి గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా కీలక పాత్రల్లో ప్రశాంత్, ప్రభుదేవా, ప్రేమ్ జి, లైలా, స్నేహా నటించారు. ఇక నేడు గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది.

ముఖ్యంగా తమిళనాడు ఆడియన్స్ పాజిటివ్ టాక్ చెప్తుండగా తెలుగు నుండి కూడా బాగానే టాక్ లభిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో దాదాపుగా అన్ని థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సక్సెస్ టాక్ తో విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీ సేల్స్ పరంగా బాగా రాబట్టిన ది గోట్ మూవీ, ఓపెనింగ్ డే అలానే ఓవరాల్ గా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

See also  Ram should Take Care of Stories రామ్ : బురదలో పన్నీరు పోసినా వృథా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories